NTV Telugu Site icon

Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..

Shobhaa (2)

Shobhaa (2)

బుల్లితెర నటి శోభా శెట్టి కన్నా మోనిత అనే పేరునే బాగా గుర్తు పడతారు… కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. ఆ పాత్రలో జీవించి నటించింది.. అలా ఆమె పాపులర్ అయ్యింది.. తన హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్‌ చేసేది. ఈ సీరియల్ లో ఆమె చేసే కుట్రలు చూసి జనాలు వామ్మో అని దడుచుకునేలా చేసింది.. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో ఛాన్స్ కొట్టేసింది.. అక్కడ కూడా విలన్ గానే చేసి నెగిటివిటిని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బిజీగా ఉంది..

బిగ్ బాస్ హౌస్ లో ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ భయపకుండా , తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా అందరిని గడగడలాడించింది.. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.. అక్కడ చెప్పినట్లుగానే బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ చేసుకుంది.. ఆ ఎంగేజ్మెంట్ ను కేవలం ఇరు ఫ్యామిలీల మధ్యే జరిగింది.. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి..

అంతేకాదు తన సొంటింతి కలను కూడా నెరవేర్చుకుంది.. తన ప్రియుడితో కలిసి కొత్త ఇంటిని సొంతం చేసుకుంది.. తాజాగా కొత్త ఇంటి గృహప్రవేశం జరిగింది.. కాబోయే భర్తతో కలిసి గృహప్రవేశం చేసింది.. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ లో పాల్గొన్న అందరు వచ్చారు. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూనే కొత్త సీరియల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..