శోభా శెట్టి అలియాస్ మోనిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది..ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో ఛాన్స్ కొట్టేసింది..
ఈ సారి ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ భయపకుండా , తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్ చూసి ముచ్చట పడింది.. ఆ షర్ట్ కావాలని అడిగింది..
ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ ఇప్పుడు ఆ షర్ట్ ను శోభాకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించింది.నాగార్జున ధరించిన టీ షర్ట్ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్ అయ్యాను. నేను టీ షర్ట్ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్ అయిన రోజు నాగ్ సర్ స్వయంగా ఆ టీషర్ట్ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్ కూడా చేశాను’ అంటూ తన ఛానెల్ లో తెలిపింది.. అంత ఇష్టంగా తీసుకున్న టీ షర్ట్ ను అమర్ దీప్ కు ఇచ్చింది.. ఎంతో ఇష్టపడిన ఆ టీ షర్ట్ ను అతనికి ఎందుకు ఇచ్చిందో అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి .. ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సీరియల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..