NTV Telugu Site icon

Shoaib Malik : సానియాతో విడాకులు..హీరోయిన్ ను మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్

New Project (72)

New Project (72)

Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ళు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గతేడాది ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు సానియా పోస్ట్ లు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు.

Read Also:PM Modi: రెండో రోజు తమిళనాడులో ప్రధాని పర్యటన.. శ్రీరంగం, రామేశ్వరంకు మోడీ..

అయితే ఈ వార్తల పట్ల ఇంత వరకూ ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలా మంది ఇరువురూ విడాకులు తీసుకున్నారని కన్ ఫాం అయ్యారు. అయితే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకింత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్.. అది మా వ్యక్తిగత విషయం అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమని మీడియాకు సూచించాడు.

Read Also:Rajasthan : అత్యాచారం కారణంగా ప్రెగ్నెంటైన బాలిక.. అబార్షన్ కు అనుమతివ్వని కోర్టు

ఇటీవల సానియా కూడా తన భర్త ఫోటో లేకుండానే ఫొటోల్ని షేర్ చేస్తోంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్లిద్దరూ ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెబుతున్నారు. కాగా, సానియా మీర్జా–పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్లు దుబాయ్‌లో ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను శనివారం సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

స‌నా జావేద్ విష‌యానికి వ‌స్తే.. పాకిస్తాన్‌ కు చెందిన ప్ర‌ముఖ న‌టీ. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లు. స‌నా అనేక టీవీ షోల్లో క‌నిపించింది. ‘ఏ ముష్త్‌-ఎ-ఖాన్‌’, ‘డంక్’ అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోల‌లో క‌నిపించింది. 2020లో ఆమె ఉమైర్ జ‌స్వాల్‌ను వివాహం చేసుకుంది. కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రు త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి ఒక‌రి ఫోటోల‌ను మ‌రొక‌రు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్ద‌రూ వీడాకులు తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

Show comments