NTV Telugu Site icon

Shivathmika: ఆ గ్యాప్‎లోనే ‘దొరసాని’కి అర్థమైందంట

Shivatmika

Shivatmika

Shivathmika: తెలుగు వారికి జీవిత రాజశేఖర్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. వారి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శివాత్మిక. ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల వచ్చిన ‘రంగమార్తాండ’లో శివాత్మిక పోషించిన పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది.

Read Also: Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?

తెలుగులో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరుతెచ్చుకున్న రాజశేఖర్ దంపతులకు రెండవ సంతానమే శివాత్మిక. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమా చూసిన వారు శివాత్మికను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించింది. ఇక ఈ సినిమా గురించి శివాత్మిక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ లీడ్ కాదు, ఇది కమర్షియల్ సినిమా కూడా కాదు. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు చాలా మంది ఆ సినిమా చెయ్యొద్దు అన్నారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెయ్యకు అన్నారు. ఇప్పుడు అలాంటి సినిమా ఎవరూ చూడరు అని అన్నారు. చాలా భయపడతారు. కానీ ఏమైంది ఆ సినిమా మంచి హిట్ అయి పేరు తీసుకువచ్చింది’ అని అని చెప్పకు వచ్చింది.

Read Also: Tanikella Bharani: బాల్య జ్ఞాపకాలతో రైల్వే క్వార్టర్స్ నేపథ్యంలో సినిమా!

అలాగే .. ‘దొరసాని’ సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నాను. ఈ సినిమా చేసిన తరువాత ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నాను. కానీ ఆ తరువాత గ్యాప్ రావడంతో, నేను అనుకున్నంత ఈజీ కాదు అనే విషయం అప్పుడు అర్థమైంది. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ పోవడమే మన చేతుల్లో ఉందనే సంగతి స్పష్టమైంది” అంటూ చెప్పుకొచ్చింది.

Show comments