Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నట వారసురాలిగా ‘దొరసాని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక రాజశేఖర్. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాత్మిక, సినీ పరిశ్రమలో నెపోటిజం, అవకాశాల వెనుక ఉన్న చేదు నిజాలను బయటపెట్టారు.
Also Read : Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
Also Read
- Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
- Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
- CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
శివాత్మిక మాట్లాడుతూ..‘రాజశేఖర్ గారి అమ్మాయి అంటే దర్శకుడి దగ్గరకు వెళ్లేందుకు ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది. కానీ, ఆ తర్వాత అవకాశం రావడం అనేది కేవలం నా ప్రతిభ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నెపోటిజం అనేది మొదటి సినిమా వరకే పనికొస్తుంది, ఆ తర్వాత ప్రతి సినిమా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ‘దొరసాని’ వల్ల నాకు ‘రంగమార్తాండ’లో అవకాశం వచ్చిందే తప్ప, నా బ్యాక్‌గ్రౌండ్ వల్ల కాదు. నేను రాజశేఖర్ కూతురిని అని తెలిసి కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి నన్ను తప్పించి మరొకరిని తీసుకున్నారు. దానికి కారణం ఏంటని అడిగితే.. నాకంటే వాళ్లకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని చెప్పారు. కేవలం ఇన్స్టాగ్రామ్ నెంబర్స్ ఆధారంగా నటీనటులను ఎంపిక చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. నేను నటిని, కంటెంట్ క్రియేటర్‌ని కాదు. యాక్టింగ్ వచ్చా? లేదా? ఆ పాత్రకు సూట్ అవుతానా? లేదా? అనేది చూడాలి కానీ ఫాలోవర్లను కాదు’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
-
TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్‌పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
-
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
-
Explainer: ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!