NTV Telugu Site icon

#90’s Web Series: ఓటీటీలోకి #90’S వెబ్ సిరీస్!

#90’s Web Series

#90’s Web Series

హీరో శివాజీ చాలాకాలం గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ద్వారా శివాజీ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

Also Read: WTC 2023-25: దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. డ‌బ్ల్యూటీసీలో అగ్ర‌స్థానానికి భారత్!

‘#90’s వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా తెరకెక్కిందింది. ప్రతి మధ్య తరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటినుంచి చెబుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను తెలంగాణలోని వనపర్తి అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కించారు. ప్రతి ఎపిసోడ్ విభిన్న భావోద్వేగాలు, మాజిక ఒత్తిడి, నమ్మకాలు, మధ్యతరగతి కుటుంబాల ఆదర్శాలతో నడుస్తుంది. ఈ సినిమాలో వాసుకి కీలక పాత్ర చేశారు. యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన మౌళి తనూజ్ ఇందులో నటించారు.