Ghost Movie : శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్నాడు. రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల 28 రోజుల పాటూ సాగిన మొదటి షెడ్యూల్ పూర్తయింది.
Read Also: Viral Video: అయ్యో.. కళ్లెదుటే బిడ్డల ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయింది
ఆ షెడ్యూల్ కి సంబందించిన మేకింగ్ స్టిల్స్, వీడియోను విడుదల చేశారు మేకర్స్. అర్జున్ జన్య బిజీఎమ్ తో మేకింగ్ వీడియో సినిమా భారీ తనాన్ని హైలైట్ చేస్తోంది. డిసెంబర్ రెండోవారం నుండి రెండో షెడ్యుల్ ప్రారంభమవుతుంది. 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ ఇంటీరియర్ సెట్ లో ఈ చిత్రీకరణ జరగనుంది. యూనిట్ తాజాగా శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. మలయాళ నటుడు జయరామ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.