Site icon NTV Telugu

Shiva Raj kumar: ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలి

Shiva Rajkumar 45 Movie

Shiva Rajkumar 45 Movie

Shiva Raj kumar: కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో దర్శకుడు అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమా జనవరి 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించింది.

READ ALSO: Pakistan: “అవును, నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..

ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘వేద’ తరువాత మళ్లీ ‘45’ మూవీ కోసం హైదరాబాద్‌కు వచ్చానని అన్నారు. తెలుగులో ఈ సినిమాను మైత్రి రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతీ ఒక్క ప్రాణిని ప్రేమిస్తారని.. గౌరవిస్తారని అన్నారు. ఎన్ని రోజులు భూమ్మీద బతుకుతామో తెలీదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని ఈ మూవీ చెబుతుందని అన్నారు.

ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ అర్జున్ కథను నెరేట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలుసు. ఈ కథను నెరేట్ చేసేటప్పుడు ప్రతీ పాత్రను యాక్ట్ చేసి మరీ చూపించారు. ఈ సినిమాలో శివన్న చేసిన పాత్రను ఏ సినిమాలో కూడా చూడలేదు. ఈ మూవీ తరువాత అర్జున్ పెద్ద దర్శకుడు అవుతాడు. నాకు ఇంత వరకు ఎవ్వరూ ఇవ్వని పాత్రను ఆయన ఇచ్చారు’ అని అన్నారు. దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ.. ‘‘45’ మూవీలో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతూన్నారని, జనవరి 1న రిలీజ్ కాబోతున్న మా మూవీని చూసి అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

READ ALSO: Prabhas: ఆయన కల్ట్ డైరెక్టర్: ప్రభాస్

Exit mobile version