NTV Telugu Site icon

Shiva Balakrishna : ముగిసిన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ విచారణ

Hmda Shiva Balakrishna

Hmda Shiva Balakrishna

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి శివబాలకృష్ణను 8వ రోజు ఏసీబీ అధికారులు విచారించారు. నేటి శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ విచారణ ముగిసింది. దీంతో శివ బాలకృష్ణ ను ఏసీపీ కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. చివరి రోజున 5గంటలు శివ బాలకృష్ణ ప్రశ్నించింది ఏసీబీ బృందం. శివ బాలకృష్ణ మేనల్లుడు భరత్ ను సైతం బినామీగా గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. శివ బాలకృష్ణను గడిచిన ఎనిమిది రోజులుగా అక్రమ ఆస్తులపై విచారించింది. అక్రమ ఆస్తులు, బినామీలపై అరా తీసిన ఏసీబీ… సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్‌ పేరు మీద భారీగా ఆస్తులు గుర్తించింది. అయితే.. ఏసీబీ విచారణలో లెక్కకు మించి శివ బాలకృష్ణ ఆస్తులు బయట పడుతుండటంతో మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరింది. 120 ఎకరాలకుపైగా స్థలాన్ని గుర్తించిన ఏసీబీ.. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట,నల్గొండ, మహబూబ్ నగర్, జనగామ, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులపై పేర్లపై భారీగా బినామీ ఆస్తులు ఉన్నట్లు, బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ఆదిత్య ఫీనిక్స్ ప్రతినిధులను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సంస్థలకు లబ్ధి చేకూర్చి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వాటాలు తీసుకునున్నట్లు అక్రమాల పుట్టాను వెలికితీస్తోంది ఏసీబీ. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు హాజరుపరుచనున్నారు.

250 కోట్లు అక్రమాస్తులు గుర్తింపు, శివ బాలకృష్ణ భూములు 214 ఏకరాలు గుర్తించాం.. 29 ప్లాట్ లు ఉన్నాయి, తెలంగాణ తో పాటు వైజాగ్ లోను ప్లాట్ లు,19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్ , 3 విల్లాలు, మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం, అధికారుల పాత్ర పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము, HMDA లో కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నాము, లాకర్స్ లోను భారీగా బంగారం, పత్రాలు గుర్తించాము, రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులపై వెరిఫై చేస్తున్నాం, మరి కొంతమంది అధికారుల పాత్ర పై దర్యాప్తు కొనసాగుతుంది’ అని ఏసీబీ అధికారులు వెల్లడించారు.