Shikhar Dhawan: గబ్బర్ కొత్త ఇన్నింగ్స్.. సోఫీతో శిఖర్ ధావన్ వెడ్డింగ్.. ఫోటోలు పంచుకున్న చాహల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan: భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలో దూసుకుపోయిన శిఖర్ ధావన్, తన నిజ జీవితంలోనూ ఒక అందమైన లక్ష్యాన్ని చేరుకున్నారు. గత కొంతకాలంగా ఆయన ప్రేమలో ఉన్న సోఫీని తాజాగా పెళ్లాడారు. ఈ విషయాన్ని ధావన్ సన్నిహిత ఫ్రెండ్, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అభిమానులు షాక్‌తో పాటు ఆనందానికి గురవుతున్నారు. ఈ వివాహ వేడుక కోసం శిఖర్, సోఫీ జంట ‘వైట్ అండ్ ఐవరీ’ థీమ్‌ను ఎంచుకున్నట్లు వాళ్ల పెళ్లి ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
సోఫీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఐవరీ, ఆరెంజ్ కలర్ 3D ఫ్లోరల్ లెహంగాలో మెరిసిపోయింది. ముత్యాల ఎంబ్రాయిడరీ బ్లౌజ్, చేతితో చేసిన పూల డిజైన్ ఆమెకు ఒక దివ్యమైన అప్సరసలాంటి లుక్‌ను ఇచ్చాయి. సోఫీ ధరించిన ఈ ఖరీదైన లెహంగా ధర సుమారు రూ.8.25 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి తోడు ముత్యాలు, కుందన్ ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచాయి. మన గబ్బర్ భాయ్ తెల్లటి ఎంబ్రాయిడరీ షేర్వానీ, తలపాగా ధరించి ఒక రాచరిక యువరాజులా కనిపించాడు. మెడలో ధరించిన పచ్చల హారం ఆయన లుక్‌కు హైలైట్‌గా నిలిచింది.
చాహల్ సందడి.. డ్యాన్స్ వీడియోలు వైరల్!
“ఇది నా స్నేహితుడి పెళ్లి..” అంటూ చాహల్ ఇన్స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. కేవలం ఫోటోలే కాకుండా, పెళ్లి వేడుకలో అతిథులతో కలిసి చాహల్ చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చాహల్ కూడా తెలుపు రంగు కోటు ధరించి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శిఖర్ ధావన్ సోఫీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై క్రికెట్ ప్రపంచం, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
READ ALSO: Ravi Basrur: ఆ రూ.35 వేలే నా జీవితాన్ని మార్చాయి.. స్టేజ్ పైనే ఏడ్చేసిన రవి బస్రూర్!
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!