టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. కరోనా మహమ్మారి సమయంలో అయితే.. భార్య, పిల్లలతో కలిసి రచ్చరచ్చ చేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గబ్బర్.. నెట్టింట పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నాడు. తాజాగా ‘లడ్డూ బాబా’ వీడియోతో ధావన్ ఆకట్టుకున్నాడు. అయితే గబ్బర్ చేసిన ఓ పోస్టు అభిమానుల అటెన్షన్‌కు గురిచేస్తోంది.
‘నాకు నిద్ర పట్టడం లేదు. ఎవరైనా సాయం చేయండి’ అంటూ గురువారం రాత్రి 10.30 గంటలకు శిఖర్ ధావన్ తన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కాగా.. అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ధావన్‌కు ఏమైందంటూ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ‘మీకు ఏమైంది సర్. ఏం జరిగినా ధైర్యాన్ని కోల్పోవద్దు. పోరాడుతూనే ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘నీకేం కాదు ధావన్, నువ్వొక ఛాంపియన్‌వి’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘మంచి నిద్ర కోసం యోగా చెయ్యు’, ‘త్వరలోనే మీకు కష్టకాలం తీరిపోతుందని భావిస్తున్నా’, ‘మీకు కష్టాలను సన్నిహితులతో పంచుకోండి’ అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. 2021లో అయేషా ముఖర్జీతో గబ్బర్ విడిపోయిన విషయం తెలిసిందే.
Also Read: IND vs NZ 2nd Test: ఏడేసిన శాంట్నర్.. 156 పరుగులకే భారత్ ఆలౌట్!
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఓ సమయంలో టీమిండియా ఓపెనర్‌గా ధనాధన్ మెరుపులు మెరిపించాడు. కెరీర్‌లో భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. టెస్టుల్లో 7, వన్డేల్లో 17 సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లోనూ గబ్బర్ రాణించాడు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 222 మ్యాచ్‌లు ఆడి 6769 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 51 అర్ధ శతకాలు ఉన్నాయి.