Site icon NTV Telugu

Shikhar Dhawan Divorce: టీమిండియా క్రికెటర్‌కు విడాకులు మంజూరు.. భార్య వల్ల మానసిక వేదన..!

Dhawan Aesha Divorce

Dhawan Aesha Divorce

Shikhar Dhawan divorce with Wife Aesha Mukerji: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్‌, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. ఆయేషా కారణంగా గబ్బర్‌ మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.

గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి శిఖర్ ధావన్‌ దూరంగా ఉంటున్నాడు. 2021లో విడాకుల గురించి ఆయేషా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఆయేషా తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గబ్బర్ విడాకుల పిటిషన్‌ ధాఖలు చేశాడు. ఈ కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్‌ చేసిన ఆరోపణలు వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. కుమారుడితో విడిగా ఉండాలని ఆయేషా ఒత్తిడి చేయడంతో.. ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా ముఖర్జీ తనను ఒత్తిడి చేసిందన్న శిఖర్ ధావన్ ఆరోపణను కూడా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ధావన్‌-ఆయేషాల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ధావన్‌కు భారత్‌ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వీడియో కాల్‌ ద్వారా కూడా తన కుమారుడితో మాట్లాడవచచ్చని తెలిపింది.

Also Read: Rohit Sharma: రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన రోహిత్.. అర్ధం కాలేదంటూ ముఖం తేలేసిన బట్లర్!

శిఖర్ ధావన్‌, ఆయేషా ముఖర్జీలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పేస్ బుక్‌లో పరిచయం అయిన ఆయేషాకు థానే ముందుగా ప్రపోస్ చేశానని ధావన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ధావన్‌, ఆయేషాలకు జొరావర్‌ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. లాక్ డౌన్ ఆరంభంలో ముగ్గురు కలిసి వీడియోస్ కూడా చేశారు. అయితే 2021లో ధావన్‌తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. శిఖర్‌తో పరిచయం కాకముందే.. ఆయేషాకు పెళ్లయింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Exit mobile version