Shatrughan Sinha confirms his presence at Sonakshi Sinha’s wedding: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి ప్రేమ వివాహం చేసుకోనున్నారు. బాంద్రాలో నేడు హల్దీ వేడుక జరగనుండగా.. పెళ్లి 23న జరగనుంది. సోనాక్షి-జహీర్ పెళ్లి కొద్దిమంది సమక్షంలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లికి సోనాక్షి కుటుంబం సభ్యులు హాజరుకావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వార్తలపై తాజాగా సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా స్పందించారు.
జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. తన కూతురు ఆనందమే తనకు మొదటి ప్రాధాన్యత అని, సోనాక్షి-జహీర్ పెళ్లికి కుటుంబసమేతంగా హాజరవుతామని చెప్పారు. ‘మీరు చెప్పండి.. ఇది ఎవరి జీవితం?. నా ఏకైక కుమార్తె సోనాక్షి జీవితంకు సంబందించినది. ఆమె పట్ల నేను చాలా గర్వపడుతున్నా. సోనాక్షి అంటే చాలా ఇష్టం. సోనాక్షి నన్ను తన మూలస్తంభంగా భావిస్తుంది. నేను పెళ్లికి తప్పకుండా హాజరవుతాను. నేను ఎందుకు పెళ్లికి హాజరవకూడదు?’ అని శతృఘ్న సిన్హా అన్నారు.
Also Read: Gold Price Today: సంతోషించేలోపే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
‘నేను సోనాక్షికి బలం మాత్రమే కాదు.. ఓ కవచంగా కూడా ఉన్నాను. సోనాక్షి-జహీర్ మంచి పెయిర్. ఇద్దరూ కలిసి గొప్ప జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’ అని శతృఘ్న సిన్హా పేర్కొన్నారు. చివరగా తన సిగ్నేచర్ డైలాగ్‌తో ఫేక్ వార్తలు రాసేవారికి వార్నింగ్ ఇచ్చారు. ‘కామూష్.. ఇది మీకు సంబంధించినది కాదు. మీ పని మాత్రమే చూసుకోండి’ అని ముగించారు.