చెతేశ్వర్ పుజారా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం మరియు సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుజారా చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (2023)లో భారత్ తరపున ఆడాడు. చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. చెతేశ్వర్ పుజారా వంటి తెలివైన టెస్ట్ బ్యాట్స్‌మన్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాల్సిందని థరూర్ అన్నారు.
Also Read:Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడానికి యత్నించిన వ్యక్తి.. కట్‌చేస్తే…(వీడియో)
పుజారా ఆట శైలి, ఆయన సహనాన్ని ప్రశంసించిన థరూర్, టెస్టు క్రికెట్‌లో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. “పుజారా పేరు వినగానే మాకు గుర్తుకువచ్చేది ఓర్పు, క్రమశిక్షణ, జట్టు కోసం త్యాగం. ఆయన నిజంగా భారత టెస్టు జట్టుకు పిల్లర్” అని థరూర్ కొనియాడారు. కఠినమైన పరిస్థితుల్లో భారత జట్టును రక్షించిన పుజారాని ‘వాల్ తర్వాతి వాల్’ (The Wall after Dravid) అని పిలుస్తూ, టెస్టు క్రికెట్‌లో ఆయన స్థానం ఎప్పటికీ గుర్తుండిపోతుందని థరూర్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
Also Read:CM Revanth Reddy : 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్తగా తెలంగాణ
అలాగే, రాబోయే తరాలకు పుజారా ఒక ఆదర్శమని, యువ ఆటగాళ్లు ఆయన ఆటతీరు, అంకితభావాన్ని అనుసరించాలని థరూర్ సూచించారు. “పుజారా రిటైర్మెంట్ టెస్టు క్రికెట్‌కు ఒక యుగాంతం” అని పేర్కొంటూ ఆయనకు భవిష్యత్తు జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. పుజారా టెస్టు కెరీర్‌లో భారత్ తరఫున 100కి పైగా మ్యాచ్‌లు ఆడి, 7,000కి పైగా పరుగులు సాధించారు.
