Gautam Gambhir: భారత క్రికెట్‌లో ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకు ఎలా దారి తీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు. భారత ప్రధాని తర్వాత దేశంలో అత్యంత కఠినమైన పని ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతేనని థరూర్ వ్యాఖ్యానించారు. రోజూ లక్షల మంది విమర్శలు ఎదుర్కొన్నా, ప్రశాంతంగా నిలబడి నిర్ణయాలు తీసుకునే గంభీర్ నాయకత్వాన్ని మెచ్చుకున్నారు. నాగ్‌పూర్‌లో గంభీర్‌తో జరిగిన భేటీని గుర్తు చేసుకుంటూ థరూర్ ఎక్స్‌లో చేసిన పోస్టు చాలామందికి నచ్చింది. కానీ అసలు చర్చ అక్కడితో ఆగలేదు. గంభీర్ ఇచ్చిన సమాధానమే కొత్త మలుపు తిప్పింది. ‘కృతజ్ఞతలు. అంతా సెటిల్ కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అప్పుడు కోచ్ అపరిమిత అధికారం సాకారమవుతుంది. అయితే ఈలోగా నన్ను నా సొంత జట్టు సభ్యులకే వ్యతిరేకంగా చూపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది’ అంటూ గంభీర్ చేసిన పోస్ట్ క్రికెట్ అభిమానుల్లో కొత్త సందేహాలను రేపింది.
READ MORE: David Reddy : మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ పవర్ ఫుల్ అప్‌డేట్..
ఎవరి పేరు చెప్పకుండానే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై చర్చలు మొదలయ్యాయి. కొంతమంది అభిమానులు గంభీర్ మాటల్లోని ‘అమిత అధికారం’ అన్న పదాన్ని లోతుగా విశ్లేషించారు. భారత జట్టు ఒక వ్యక్తి చేతిలో నడిచేది కాదని, కోచ్ ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే వాడుకాదని గుర్తు చేసే ప్రయత్నమే అని కొందరు భావించారు. మరికొందరికి మాత్రం ఆ మాటలు నచ్చలేదు. ఈ చర్చ రెండు వైపులా చీలిపోయాయి. గంభీర్‌కు మద్దతు ఇచ్చేవాళ్లు, కోచ్‌పై అనవసరంగా అన్ని నిర్ణయాల భారం వేస్తున్నారని అన్నారు. విమర్శకులు మాత్రం, అధికారం లేదని చెప్పుకుంటే ఫలితాలకు బాధ్యత కూడా తగ్గిపోతుందా? అని ప్రశ్నించారు. టి20 వరల్డ్ కప్ 2026కి ముందు ఇలాంటి మాటలు అవసరమా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
READ MORE: Bhojshala Complex: భోజశాల మందిరామా, మసీదా..? ఒకప్పటి సంస్కృత విద్యా కేంద్రం, నేడు వివాదం..
