Sharwa 37 : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ – కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోగా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికి ఓటీటీ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కూడా రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ శర్వానంద్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. Sharwa 37 అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ చిత్ర షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Read Also:Bengaluru: దారుణం.. కుక్కను కారుతో ఢీకొట్టి చంపిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్
ఆ మధ్య సినిమాకు సంబంధించిన కేరళ షెడ్యూల్ పూర్తి అయ్యిందని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. అందమైన లొకేషన్లలో 10 రోజుల షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయిందని తెలుపుతూ టీం ఫొటోను చిత్ర బృందం షేర్ చేసింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
Read Also:PM Modi: జిన్‌పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
శర్వా 37 చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సంక్రాంతి రోజైన జనవరి 14న ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. శర్వానంద్ ఈ చిత్రంతో పాటు అభిలాష్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలోను ఓ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో 38వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నాడు శర్వానంద్. వీటిలో ఈ సినిమా శర్వాకు హిట్ ఇస్తుందో చూడాలి