Naari Naari Naduma Murari: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శర్వానంద్ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. కానీ, నిర్మాతల ప్లానింగ్‌తో ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయ్యి హిట్టు కొట్టింది. అయితే.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.
READ MORE: Katasani Ram Bhupal Reddy: పవన్ కల్యాణ్‌పై కాటసాని హాట్ కామెంట్స్..
ఇంతకీ కథేంటి?
ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే గౌతమ్ (శర్వానంద్), అదే కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే అనూహ్యంగా గౌతమ్ పాస్ట్ రిలేషన్ కారణంగా ఈ పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి. ఆ రిలేషన్ కారణంగా ఎందుకు పెళ్లికి ఇబ్బంది ఏర్పడింది? అసలు గౌతమ్ పాస్ట్ రిలేషన్‌లో ఉన్న దియా(సంయుక్త)తో ఎందుకు బ్రేకప్ అయింది? గౌతమ్ తండ్రి కార్తీక్ (సీనియర్ నరేష్) లేటు వయసులో ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు? అతని లేటు పెళ్లి గౌతమ్ పెళ్లికి అడ్డంకిగా మారిందా? చివరికి గౌతమ్ నిత్యను పెళ్లి చేసుకున్నాడా లేదా? గౌతమ్ లైఫ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన దియా ఏం చేసింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని ఓటీటీలో వీక్షించండి.
