Site icon NTV Telugu

Naari Naari Naduma Murari : ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

Sharwanand, Naari Naari Naduma Murari, Telugu Movies Ott

Sharwanand, Naari Naari Naduma Murari, Telugu Movies Ott

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాండినేషన్‌లో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక యువకుడి కథను దర్శకుడు చాలా సరదాగా తెరకెక్కించారు. ముఖ్యంగా శర్వానంద్ టైమింగ్, కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంయుక్త, సాక్షి తమ నటనతో ఆకట్టుకోగా.. నరేష్ వంటి సీనియర్ నటులు తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే పాపులర్ అవ్వగా, సినిమా విజువల్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అనిల్ సుంకర నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేసింది.

Also Read : ‘Michael’ Trailer Out: మళ్లీ తిరిగొచ్చిన ‘కింగ్ ఆఫ్ పాప్’.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ అదుర్స్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 3వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని హాయిగా ఈ వినోదాన్ని ఆస్వాదించవచ్చు. ఒక మంచి వీకెండ్ వాచ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. థియెటర్ లో సైలెంట్ గా వచ్చి మంచి హిట్ అందుకున్నా ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మీరు ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారైతే వెంటనే వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసేసుకోండి!

Exit mobile version