Site icon NTV Telugu

శర్వానంద్ గ్యారేజీలోకి Lexus LM 350H లగ్జరీ కారు.. ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

Lexus Lm 350h

Lexus Lm 350h

Lexus LM 350H: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల ఎంపికలో ఎంత ప్రత్యేకత చూపుతాడో.. ఆయన కార్ల కలెక్షన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తన గ్యారేజీలో ఇప్పటికే పలు ప్రీమియం వాహనాలు ఉన్నప్పటికీ.. తాజాగా ఆయన మరో హై-ఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఈ కొత్త వాహనం పేరు లెక్సస్ LM 350H (Lexus LM 350H) ప్రీమియం MPV. దీని విలువ సుమారు 2 కోట్ల నుండి 3 కోట్ల మధ్య ఉంటుంది.

India Economy: భారత డిజిటల్ ఆర్థికవ్యవస్థను మార్చుతున్న Gen Z.. ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తున్నారంటే..?

లగ్జరీ కార్లను ప్రేమించే శర్వానంద్ వద్ద ఇప్పటికే పలు ఖరీదైన వాహనాలు ఉన్నాయి. రేంజ్ రోవర్ (Range Rover), ఆడి క్యూ5 (Audi Q5), మిత్సుబిషి పజెరో (Mitsubishi Pajero), బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7) వంటి ప్రీమియం కార్లు అతనితో ఉన్నాయి. తాజాగా ఈ అద్భుతమైన జాబితాలోకి బ్లాక్ లెక్సస్ LM 350H వచ్చి చేరింది. ఈ మోడల్ టయోటా కంపెనీకి చెందిన ప్రముఖ లగ్జరీ వెహికల్ వెల్‌ఫైర్ (Vellfire) కంటే కూడా మరింత అసాధారణమైన సౌకర్యం, లగ్జరీని అందిస్తుంది.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కస్డడీకి ప్రభాకర్ రావు

శర్వానంద్ తన కొత్త లెక్సస్‌ను డ్రైవ్ చేసుకుని షోరూమ్ నుండి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుపు దుస్తుల్లో, చక్కగా పోనీటైల్ కట్టుకుని ఉండి స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఈ కారులో అల్ట్రా లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ప్రైవసీ, కంఫర్ట్, అత్యాధునిక టెక్ ఫీచర్స్‌తో కూడిన పూర్తి ప్యాకేజీగా చెప్పవచ్చు. ఈ కారులో ప్రయాణిస్తే విమానంలో ఫస్ట్-క్లాస్ అనుభూతి కలుగుతుందని చెబుతారు. ఇక ఇందులో ప్రధాన ఫీచర్లుగా 48 అంగుళాల టీవీ, ఎయిర్‌లైన్ శైలి రెక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఆర్మ్ రెస్ట్‌లు, చిన్న ఫ్రిజ్, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో నడుస్తుంది. కేవలం 8.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా 190 kmph వేగంతో దూసుకుపోగలదు.

Exit mobile version