Shaqkere Parris smash a huge 124-meter six in CPL 2024: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 19వ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఓపెనర్ షక్కెరె పారిస్ భారీ సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు మంచి శుభారంభం లభించలేదు. అయితే, చివరి ఓవర్లలో రొమారియో షెఫర్డ్ చెలరేగగా.. 24 బంతుల్లో 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
Rishabh Pant Angry: నన్నెందుకు కొడుతున్నారు.. బంగ్లా ప్లేయర్‌పై పంత్ ఆగ్రహం!
ఈ లక్ష్యాన్ని ఛేదించిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ షక్కెరె ప్యారిస్ అదిరిపోయే శుభారంభం అందించాడు. ముఖ్యంగా గుడాకేష్ మోతీ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా ఓ భారీ సిక్సర్ బాదాడు. అదికూడా 124 మీటర్ల భారీ సిక్స్. ఈ సిక్స్‌తో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా షక్కెరే ప్యారిస్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
124 metres!!! You have to be joking Shaqkere Parris🤯#CPL #TKRvGAW #BiggestPartyInSport #CricketPlayedLouder #CaribbeanAirlines @iflycaribbean pic.twitter.com/ev72KN13H7
— CPL T20 (@CPL) September 19, 2024