NTV Telugu Site icon

Shamshabad: శంషాబాద్ ఘన్సీమియాగూడ గుర్తుతెలియని జంతువు సంచారం..భయాందోళనలో జనాలు

New Project (2)

New Project (2)

భయాందోళనలో శంషాబాద్.. ఘన్సీమియాగూడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఆ పరిసరాల్లో ఓ గుర్తుతెలియని జంతువు సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ జంతువు ఏదనేది గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరాల్లో జంతువు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా DFO, విజయానంద్ మాట్లాడారు. అక్కడ సంచరిస్తున్న జంతువు హైనా నా, చిరుత నా అనేది గుర్తించలేకపోతున్నామన్నారు. 10 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లు ఏర్పాటు చేశామని… ఎక్కడా జంతువు ఆనవాళ్లు దొరకలేదని స్పష్టం చేశారు. ఈరోజు మరొక 6 కెమెరాలు పెడుతున్నామని తెలిపారు.

READ MORE: Weather Updates: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!

గడ్డి ఎక్కువగా పెరిగిందని.. సీసీ కెమెరా ఫుటేజ్ లో వర్షం ఉండటం వల్ల జంతువును సరిగ్గా గుర్తించలేకపోతున్నామని విజయానంద్ తెలిపారు. హైనా అయినా, చిరుత అయినా.. స్థానికులకు ఎలాంటి అపాయం జరగకూడదన్నారు.
ఆ జంతువును పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అడవి నుంచి బయటకు వచ్చిన జంతువులు.. అంత త్వరగా ట్రాప్ లో పడవుని వెల్లడించారు. ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వద్దని సూచించారు.

READ MORE: Vijayawada: జంతు చర్మాల స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు..(వీడియో)

కాగా .. నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి. అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది. వారం రోజులు శ్రమించి దాన్నిపట్టుకున్నారు.