Site icon NTV Telugu

Shamshabad Airport: ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద బ్యాగ్‌.. తెరిచి చూసి షాక్ అయిన సిబ్బంది..!

Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఒక అనుమానాస్పద బ్యాగ్‌ కలకలం రేపింది. అరైవల్స్‌ వద్ద వదిలివేసిన బ్యాగ్‌ను గుర్తించిన సీఐఎస్ఎఫ్‌ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్‌ కారణంగా కొంతసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం బ్యాగ్‌లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని తేలింది. బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో మొబైల్‌ ఫోన్లు, సిగరెట్‌ ప్యాకెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాగ్‌లో లభించిన మొబైల్స్‌, సిగరెట్ల మొత్తం విలువ రూ.12.72 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆ బ్యాగ్‌ ఎవరిది? ఎందుకు వదిలేసి వెళ్లారు? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొన్నా, అనంతరం పరిస్థితి సర్వసాధారణంగా మారింది.

READ MORE: Telugu Titans: విజృంభిస్తున్న తెలుగు టైటాన్స్‌.. రెండడుగుల దూరంలో ప్రొ కబడ్డీ కప్!

మరోవైపు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో లైవ్ బుల్లెట్ కలకలం రేపింది. కొలకతా నుంచి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన విశాల్ అనే వ్యక్తి వద్ద లైవ్ బుల్లెట్ గుర్తించారు. కొల్‌కత్త నుంచి ఇండిగో (6E-6709) విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు విశాల్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి బెంగుళూరు వెళ్లేందుకు సిద్ధమైన విశాల్ బ్యాగ్ ను సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చెకింగ్ చేశారు. ఇందులో లైవ్ బుల్లెట్ గుర్తించారు.

Exit mobile version