Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లుఫ్తాన్సాకు చెందిన ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు దుండగులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. శంషాబాద్ చేరుకునేలోగా విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపు మెసేజ్ పంపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది, భద్రతా విభాగాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రస్తుతం భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మెయిల్ సోర్స్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఇదేం మొదటి సారి కాదు.. అనేక సార్లు మెయిల్స్ వచ్చాయి. గత నెల 26న సైతం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు టెర్మినల్ అంతటా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ప్రతి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇది ఫేక్ ఈ -మెయిల్ అని నిర్ధారించారు. తనిఖీల సమయంలో కాసేపు విమానాశ్రయంలో భద్రతా జాగ్రత్తలు చేపట్టినప్పటికీ, సాధారణ విమాన సేవలకు పెద్ద అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ఇది ఫేక్ ఈ -మెయిల్ అని తేలడంతో విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!