Site icon NTV Telugu

Shambhala OTT: ఆది సాయి కుమార్ ‘శంబాల’ ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Shambala Move Ott

Shambala Move Ott

ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్‌తో రిలీజ్ అయిన లేటెస్ట్ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “శంబాల” ఒకటి.  ఆది సాయికుమార్ హీరోగా, అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పై ముందు నుంచి ప్రేక్షకులలో ఉన్న.. ఈ మధ్య కాలంలో వస్తున్న డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ సబ్జెక్టు లలో ఇది మరో కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇందులో సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో చెప్పించిన బ్యాక్ స్టోరీ కూడా ఆడియెన్స్‌కి ఒక కొత్త సమాచారాన్ని అందించినట్టు అనిపిస్తుంది. అదే విధంగా..ఆది సాయి కుమార్ కూడా మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. అయితే సుమారు 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి టైలర్.. టీజర్ తో పాజిటివ్ బజ్ రావడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తాజా సమాచారం ప్రకారం,

Also Read : Nuvvu Naaku Nachav : ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha) దాదాపు రూ.10 కోట్ల రూపాయల రికార్డ్ ధరకు దక్కించుకుంది. ఆది సాయికుమార్ కెరీర్‌లోనే అత్యధిక ఓటీటీ ధర పలికిన చిత్రంగా ‘శంబాల’ నిలవడం విశేషం. అలాగే శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. సాధారణంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే,

జనవరి మూడో వారంలో ఈ మిస్టికల్ థ్రిల్లర్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, బాక్సాఫీస్ వద్ద సినిమా రన్‌ను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగడంతో థియేట్రికల్ వసూళ్లు కూడా బాగుంటాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Exit mobile version