Site icon NTV Telugu

Shambala : అలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం – అర్చన అయ్యర్

Archana Ayyar, Shambala

Archana Ayyar, Shambala

కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు రావడం అనేది అదృష్టం‌తో కూడుకున్నది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో. వారి కెరీర్ లో ముందుకు సాగడం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు. అయితే తాజాగా ఇదే విషయం పై నటి అర్చన అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కృష్ణమ్మ’ సినిమాతో మెప్పించిన ఈమె, ఇప్పుడు ఆది సాయికుమార్‌తో కలిసి ‘శంబాల’ అనే ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ సినిమా నేడే (గురువారం) రిలీజ్ అవుతున్న సందర్భంగా, అర్చన తన అనుభవాలను పంచుకుంది..

Also Read : RGV : పాన్ ఇండియా మేకర్స్‌ను భయపెడుతున్న ‘ధురంధర్’ కుక్క!

అర్చన మాట్లాడుతూ.. ‘కథ వినకుండానే ఓకే చెప్పేశా! సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కథ మొత్తం విన్నాకే సినిమా సైన్ చేస్తారు. కానీ నేను మాత్రం ‘శంబాల’ కథ పూర్తిగా వినకుండా ఓకే చెప్పేశా. దానికి కారణం డైరెక్టర్ యుగంధర్ ముని చెప్పిన పాయింట్ అంతగా నచ్చింది..”ఈ సినిమా మొదలైన ఐదు నిమిషాలకే ఆడియెన్స్ ఒక కొత్త ప్రపంచం లోకి వెళ్ళిపోతారు. ఆ కథలో ఉండే గ్రిప్పింగ్ అలాంటిది” అని ఆమె కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ సినిమాలో తాను ‘దేవి’ అనే అమ్మాయిగా కనిపిస్తానని, ఆ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుందని వివరించారు. అందుకే కథ కూడా వినలేదు’ అని చెప్పుకొచ్చింది.. అంతే కాదు

‘ఇప్పటికే ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దల కోసం ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు.. అది చూసిన చాలామంది దర్శకులు నాకు ఫోన్ చేసి,చాలా బాగా నటించారు.. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.. అని మెచ్చుకున్నారు. ఆ ఫోన్ కాల్స్ చూశాకే నాకు నమ్మకం కలిగింది, ఇంతటి గొప్ప అవకాశం వచ్చినందుకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కేవలం జంప్ స్కేర్లు మాత్రమే కాకుండా, ఒక మంచి ఎమోషనల్ జర్నీ ఈ సినిమాలో ఉంటుందని, థియేటర్లలో ఈ సినిమా అందరికీ ఒక కొత్త ఫీలింగ్‌ను ఇస్తుందని అర్చన భరోసా ఇచ్చారు.

Exit mobile version