NTV Telugu Site icon

Shakib Al Hasan: చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్.. తొలి ఆటగాడిగా

Shakib

Shakib

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బంతితో 14,000 పరుగులు మరియు 700 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు నిలిచాడు. యూఎస్ వర్సెస్ బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఈ రికార్డును సాధించాడు. కాగా.. ఇప్పటి వరకు 48 మంది బ్యాటర్లు 14,000 పరుగులు చేశారు. 17 మంది బౌలర్లు 700 వికెట్లు పడగొట్టారు. కానీ ఈ రెండింటినీ సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా షకీబ్ అల్ హసన్ నిలిచాడు.

Read Also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోగా.. ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్‌తో 17000 కంటే ఎక్కువ పరుగులు, 700 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన ప్రశంసల పోస్ట్‌ను షేర్ చేసింది.

Read Also: Vizag: విశాఖ జనసేన కార్పొరేటర్కు త్వరలో లీగల్ నోటీస్..!

బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో యుఎస్‌ఎతో జరిగిన టీ20 సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఓటమిపై స్పందించాడు. ఈ సిరీస్ లో ఓడిపోవడం చాలా నిరాశపరిచిందని తెలిపాడు. నిన్న జరిగిన మూడో టీ20లో గెలుపొంది బంగ్లాదేశ్‌ క్లీన్‌ స్వీప్‌ పరాభవం నుంచి తప్పించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్‌ ఆరు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.