NTV Telugu Site icon

Shakib Al Hasan: ఈ క్రికెటర్ కోపం చూశారా.. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని ఏం చేశాడంటే..?

Shakib

Shakib

బంగ్లాదేశ్ స్టార్‌ క్రికెటర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శివాలెత్తాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడాడు. అంతేకాకుండా.. అతని మెడపట్టి గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ప‌లుమార్లు అభిమానుల‌పై చేయిచేసుకున్నాడు ష‌కీబ్. అయితే.. ఈసారి ఏకంగా మెడ పట్టుకుని గెంటేశాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్ కు షకీబ్ అల్ హసన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో.. టాస్ వేస్తున్న సమయంలో ఓ అభిమాని గ్రౌండ్ లోకి తన దగ్గరికి వచ్చి షకీబ్ ను సెల్ఫీ కావాలని అడిగాడు. దానికి కుదరదు వెళ్లు అంటూ నిరాకరించాడు. అభిమాని పలుమార్లు సెల్ఫీ కావాలని విసిగిస్తుండటంతో కోపంతో మెడపట్టుకుని ఈడ్చాడు.

Read Also: Leopard Attack: కళ్లుమూసి తెరిచేలోపు చిరుతకి ఆహారమైన శునకం.. వైరల్ వీడియో..

అయితే.. ష‌కీబ్ తీరు ప‌ట్ల క్రికెట్ అభిమానులు, నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులపై ఇలా చేయి చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ కు ఇలాంటి కాంట్రవర్సీలు కొత్తేం కాదు.. ఫీల్డ్‌లో అత్యంత కోపిష్టి బంగ్లాదేశ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చే ఈయన పేరే. ఇలాంటి సంఘటనలతో షకీబ్ పలుమార్లు వార్తల్లోకెక్కాడు. దేశవాళీ లీగ్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై చిర్రెత్తుకుపోవడం, స్టంప్‌లను తన్నేయడం, సెల్ఫీలంటూ వచ్చిన అభిమానుల‌పై చేయెత్తడం వంటి విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.

Read Also: Red Banana : ఎర్ర అరటిపండ్లను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..