Site icon NTV Telugu

Sharukh Khan : వజ్రాలతో ఇంటిముందు నేమ్ ప్లేట్ పెట్టించిన షారుఖ్.. ఖర్చు తెలిస్తే షాకే

Mannat

Mannat

Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఏం చేసినా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పనికి జనాలందరూ షాకవుతున్నారు. ఇంటి ముందు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నేమ్ ప్లేట్ పెట్టించాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని చూడదగ్గ ప్రదేశాల్లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఇల్లు కూడా ఒకటి. భారీగా ఖర్చుపెట్టి తనకి నచ్చినట్టు చాలా గ్రాండ్ గా నిర్మించుకున్నారు షారుఖ్. ఆ ఇంటికి మన్నత్ అని పేరు పెట్టుకున్నాడు. మన్నత్ కూడా ముంబైలో ఫేమస్ ప్లేస్ అయిపోయింది. చాలా మంది ఆయన అభిమానులు… ముంబై నగరాన్ని తిలకించేందుకు వచ్చిన వాళ్లు షారూఖ్ ఇంటిని చూడకుండా వెళ్లరు. అలాంటి ఇంటిని మరింత గ్రాండీయర్ తీసుకువచ్చే క్రమంలో షారూఖ్ గతంలో వజ్రాలతో ఉన్న నేమ్ ప్లేట్ ని చేపించారు.

Read Also: Twitter Shock to Films: సినీ ఇండస్ట్రీని భయపెడుతున్న ట్విట్టర్

వజ్రాలతో ఉండే ప్లేట్ పై మన్నత్ అని రాసి ఉంటుంది. దీనిని ఇంటి ముందు అమర్చారు. దీంతో నేమ్ ప్లేట్ కోసం వజ్రాలతో చేయించాలా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల గతంలో ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని తీసేశారు. తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్ పెట్టించారు షారుఖ్. దాదాపు 35 లక్షల విలువ చేసే వజ్రాల ముక్కలతో నేమ్ ప్లేట్ తయారు చేయించి దానిపై మన్నత్ అని రాపించి ఇంటిముందు పెట్టాడు షారుఖ్. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత వెలుగుతో అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని చూసేందుకు మరోసారి ఆయన అభిమానులు షారుఖ్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఎంత డబ్బు ఉంటే మాత్రం వజ్రాలతో నేమ్ ప్లేట్ చేయించి ఇంటి బయట పెట్టాలా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఇంటి వజ్రాల నేమ్ ప్లేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Exit mobile version