Shaheen Shah Afridi Marriage: రెండోసారి పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ.. పెళ్లి కూతురు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3న కరాచీలో షాహీన్ మరియు అన్షాలు వివాహం చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే.
షాహీన్ షా అఫ్రిదీ, అన్షా అఫ్రిదీల వివాహా కార్యక్రమానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మొహ్మద్ రిజ్వాన్ హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు క్రీడాకారులు కూడా హాజరయ్యారు. స్పీడ్‌స్టర్ అఫ్రిదీని బాబర్ ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2023లో పాక్ సూపర్-4 నుంచి నిష్క్రమించిన అనంతరం బాబర్, అఫ్రిదీ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో అఫ్రిదీని బాబర్ ఆలింగనం చేసుకొవడంతో అంతా సెట్ అయినట్టే అనిపిస్తోంది.
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
షాహీన్ ఆఫ్రిది, అన్షాల మొదటి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ వివాహానికి కొద్ది మంది సన్నిహితులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఈ జంట తమ పెళ్లిని ఘనంగా జరుపుకోవాలనుకుందట. అందుకే రెండో పెళ్లిని ఘనంగా ప్లాన్ చేశారని సమాచారం. ఆఫ్రిది, అన్షాలు 6 నెలల వ్యవధిలోనే రెండోసారి పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. షాహీన్‌తో దిగిన ఫోటోను బాబర్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
23 ఏళ్ల షాహీన్ షా అఫ్రిది 2018లో పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 27 టెస్టులు, 44 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. షాహీన్ వరుసగా 105, 86, 64 వికెట్స్ పడగొట్టాడు. ఆసియా కప్ 2023లో అదరగొట్టిన షాహీన్.. ఇక ప్రపంచకప్ 2023 కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు షాహిద్ ఆఫ్రీది పాక్ తరపున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. షాహిద్ ఆఫ్రీదికి నలుగురు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. కుమారుడు అందరికంటే చిన్నవాడు. షాహీన్ చేసుకున్న అన్షా రెండో కూతురు.
Exclusive scenes from wedding ceremony of Shaheen Shah Afridi with Shahid Afridi’s daughter Ansha Afridi in Karachi. #ShaheenShahAfridi #BabarAzam #ShahidAfridi #Karachi #TOKReports pic.twitter.com/RAWBvSMgwr
— Times of Karachi (@TOKCityOfLights) September 19, 2023
Heartiest congratulations! ❤️ pic.twitter.com/jo0lDPYURT
— Babar Azam (@babarazam258) September 19, 2023
తాజావార్తలు
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!