Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Shaheen Iii Vs Agni 5 Missile Comparison Pakistan India Defense Analysis

Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!

Published Date :April 5, 2026 , 1:28 pm
By RAMAKRISHNA KENCHE
Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shaheen-III vs Agni-V: భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పాకిస్థాన్ వణికిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఏవైనా కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు. ఒకవేళ అదే జరిగితే.. భారత ప్రతిస్పందన ఊహించని రీతిలో నిర్ణయాత్మకంగా ఉంటుందని బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉరి సెక్టార్‌ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌ లాంటి దాడులను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చి కూతలు కూశారు. ఒకవేళ భారత్ పాకిస్థాన్ యుద్ధం వస్తే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కామని.. ఏకంగా కోల్‌కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ పాకిస్థాన్ ఇంత పెద్ద వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఆ దేశం వద్ద ఉన్న ఓ క్షిపణి. ఆ క్షిపణి పేరే ‘షాహీన్-III’ (Shaheen-III). ఈ పాక్ క్షిపణితో పాటు భారత్‌ వద్ద ఉన్న డేంజరెస్ ‘అగ్ని-5’ (Agni-V) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

READ MORE: Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

పాకిస్థాన్‌కు ఇంత ధైర్యం ఇచ్చిన మిస్సైల్ ఏది?
ఇక పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ నుంచి కోల్‌కతాకు గగనతల దూరం సుమారు 1700 కిలోమీటర్లు కాగా, రోడ్డు మార్గంలో ఇది 2000 కిలోమీటర్లకు పైమాటే. ఇంత సుదూరంలో ఉన్న భారత నగరాన్ని తాము సులభంగా లక్ష్యంగా చేసుకోగలమని, అందుకు అవసరమైన ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందని పాక్ బీరాలు పలుకుతోంది. ప్రధానంగా పాకిస్థాన్ అమ్ములపొదిలోని బాలిస్టిక్ క్విపణి ‘షాహీన్-III’ (Shaheen-III) క్షిపణిని ఉద్దేశించే ఈ బెదిరింపులకు దిగుతోంది. ఈ క్షిపణి సామర్థ్యం 2750 కిలోమీటర్లు. 2015లో తొలిసారి పరీక్షించిన ఈ క్షిపణి, ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణిని రోడ్డుపై ప్రయాణించే మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఇది కేవలం కోల్‌కతా మాత్రమే కాదు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పాటు అండమాన్ నికోబార్ దీవులను కూడా తాకగలదు. భారత్ మొత్తాన్ని తన పరిధిలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పాక్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.

భారత్‌తో ఉన్న క్షిపణుల సామర్థ్యం ఇదే..
పాకిస్థాన్ ఈ స్థాయిలో బెదిరింపులకు దిగడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భారత్‌ను వ్యూహాత్మకంగా నిలువరించడమే. అయితే, పాక్ క్షిపణుల కంటే భారత్ వద్ద ఉన్న ‘అగ్ని-5’ (Agni-V) వంటి క్షిపణులు అత్యంత శక్తివంతమైనవి. ఇవి 7000 కిలోమీటర్లకు పైగా ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలవు. అంతేకాకుండా, భారత్ వద్ద ఉన్న అత్యాధునిక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (Air Defense Systems), పాక్ క్షిపణులను అవి ప్రయోగించిన తొలి దశలోనే గగనతలంలోనే కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు గాలిలో దీపాల్లాంటివే అయినా, తూర్పు భారతంపై వారు కన్నేయడం రక్షణ రంగ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agni 5 missile India
  • Agni V features
  • ballistic missiles South Asia
  • India defence system
  • India vs Pakistan missile comparison

తాజావార్తలు

  • Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్” చూసే రెచ్చిపోతోంది!.. పాక్ క్షిపణిని పడగొట్టే భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions