NTV Telugu Site icon

Shah Rukh Khan Health Update: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ పోస్ట్‌!

Srk Manager Pooja Dadlani

Srk Manager Pooja Dadlani

Shah Rukh Khan Health Update: బాలీవుడ్‌ స్టార్ హీరో, కోల్‌కతా నైట్‌ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్‌ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ అనంతరం షారుక్ ఆటగాళ్లతో మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలోనే ఎస్‌ఆర్‌కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. గురువారం షారుక్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

షారుక్‌ ఖాన్‌ డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. అయితే ఎస్‌ఆర్‌కే ఆరోగ్యపరిస్థితి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ‘ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఫాన్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్‌ఆర్‌కేపై ఫ్యాన్స్‌ చూపించే ప్రేమ, ప్రార్ధనలు ఆయనకు మరింత బలాన్ని ఇచ్చాయి. అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు’ అని పూజా పేర్కొన్నారు.

Also Read: Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోల్డెన్‌ వీసా!

షారుక్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై కేకేఆర్‌ సహ యజమాని జూహీ చావ్లా కూడా స్పందించారు. దేవుడి దయ వల్ల ఎస్‌ఆర్‌కే త్వరగా కోలుకుంటున్నాడని, కేకేఆర్‌ను ప్రోత్సహించేందుకు ఐపీఎల్‌ 2024 ఫైనల్‌కు తప్పకుండా వస్తాడని తెలిపారు. మే 26న ఐపీఎల్ 2024 ఫైనల్‌ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం అవనుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈరోజు జరగనున్న క్వాలిఫయర్‌-లో విజేతగా నిలిచే జట్టుతో కేకేఆర్‌ తలపడనుంది.

Show comments