Site icon NTV Telugu

Shah Rukh Khan: వామ్మో.. షారుఖ్ ఖాన్ వాచ్ ధర 28 ఫార్చ్యూనర్ కార్లకు సమానం!

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan: కింగ్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా అందరి చూపులు అతడిపైనే ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ అడుగుపెట్టి పెట్టగానే సోషల్ మీడియా ఊగిపోయింది. షారుఖ్ ఎంట్రీ, స్టైల్, లుక్.. అన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో షారుఖ్ ఖాన్ చాలా క్లాస్‌గా కనిపించాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఒక్కసారిగా షారుఖ్ ధరించిన వాచ్‌పై పడింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. అది సాధారణ వాచ్ కాదు.. రూ. కోట్ల విలువైన లగ్జరీ వాచ్. సెలబ్రిటీ వాచీలపై సమాచారం అందించే ‘సెలెబ్ వాచ్ స్పాటర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రకారం.. షారుఖ్ ఖాన్ రోలెక్స్ డేటోనా వాచ్ ధరించాడు.

READ MORE: PM Modi: బీజేపీ కొత్త అధ్యక్షుడి పిల్లలతో మోడీ సంభాషణ.. వీడియో వైరల్

ఇది వైట్ గోల్డ్‌తో తయారు చేసిన రోలెక్స్ డేటోనా వాచ్. డయల్‌పై సిల్వర్ మెరుపు కనిపించే ఆబ్సిడియన్ స్టైల్ ఉంటుంది. దీని అసలు ప్రత్యేకత ఏమిటంటే.. ఆ డయల్ చుట్టూ మొత్తం 36 నీలి నీలమణులు అమర్చారు. లోపల టైమ్ చూపించే చోట కూడా 11 బ్లూ సఫైర్ రత్నాలు ఉన్నాయి. అందుకే ఆ వాచ్ చూస్తేనే రాజసంగా అనిపిస్తోంది. ఈ వాచ్ ధర గురించి తెలిస్తే అందరూ అవాక్కవుతారు. దీని ధర దాదాపు 14 కోట్ల రూపాయలు. అదే డబ్బుతో 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కార్లు దాదాపు 28 కొనొచ్చు. ఈ వాచ్‌ ధరపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. షారుఖ్ ఖాన్ స్టైల్ ఇలాగే ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. షారుఖ్‌ ఖరీదైన వాచ్ ధరించడం ఇది మొదటి సారి కాదు.. ఇంతకుముందు కూడా షారుఖ్ ఖాన్ ఒక ఫోటోషూట్‌లో ఖరీదైన వాచ్ ధరించారు. ఆ వాచ్ ధర రూ.7 లక్షల అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని విలువ సుమారు 5.90 కోట్లు. అది ఆడెమార్స్ పిగే అనే లగ్జరీ బ్రాండ్ వాచ్. రోజ్ గోల్డ్‌తో తయారు చేసిన ఆ వాచ్ కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. షారుఖ్ ఖాన్ సినిమాలతోనే కాదు, తన స్టైల్‌తో క్లాస్‌తోనూ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటారు.

READ MORE: Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ? ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

Exit mobile version