NTV Telugu Site icon

Shah Rukh Khan : నేను అక్కడే నటిస్తూ చనిపోవాలి.. తన కోరికను బయటపెట్టిన షారూఖ్ ఖాన్

New Project 2024 10 19t132849.585

New Project 2024 10 19t132849.585

Shah Rukh Khan : కొన్ని దశాబ్ధాల నుంచి బాలీవుడ్‌ను కింగ్‌లా ఏలుతున్నారు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్, కింగ్ ఆఫ్ రొమాన్స్ ఇలా ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇంతటి స్టార్‌ షారుఖ్ ఖాన్‌ రాత్రికి రాత్రే అయిపోలేదు. ఛాన్సుల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు.. ముంబైలో నిలువ నీడ లేక బీచ్‌లో పడుకున్న రోజులూ ఉన్నాయి. పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలతో పాటు లైట్ మెన్ గా కూడా పనిచేశారట. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోగా, విలన్ గా ఇలా ఏ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ దశలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్- కాజోల్ జంటగా నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ ఓవర్‌నైట్ స్టార్‌ అయిపోయాడు. నాటి నుంచి ఆయన వెనుదిరిగి చూడకుండా వరుస బ్లాక్‌బస్టర్లతో బాలీవుడ్‌కి, భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా మారారు.

Read Also:Panipuri: పానీపూరి రుచి కోసం యూరియా, హార్పిక్.. కాళ్లతో పిండిని కలిపి(వీడియో)

గౌరీ ఖాన్‌ను ప్రేమించిన ఆయన తన పెళ్లిని హిందూ సాంప్రదాయంలో చేసుకున్నారు. తన ఇంట్లో హిందూ, ముస్లిం ఆచారాలను, అన్ని పండుగలను నిర్వహిస్తూ అన్ని మతాలు తనకు సమానమేనని చాటుకున్నాడు. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ , ఇతర వ్యాపారాల ద్వారా ప్రతి ఏడాది వందల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. భారత్‌లో అత్యంత సంపన్నులైన సినీ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. 60కి దగ్గరవుతున్నా నేటికీ అదే ఎనర్జీతో కుర్ర హీరోలకే పోటీనిస్తున్నారు.

Read Also:Bandi Sanjay: నేను కేంద్ర మంత్రినైనా మీకోసం రోడ్డెక్కుతున్న.. గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్..

అలాంటి ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం తాను నటుడిగానే ఉంటానని, సినిమా సెట్‌లోనే తాను కన్నుమూయాలని.. ఇదే తన ఆఖరి కోరిక అన్నారు షారుఖ్. స్టార్‌డమ్ వల్లే అభిమానులు, గుర్తింపు, డబ్బు లభించాయని అందుచేత స్టార్‌డమ్‌ను గౌరవిస్తానని చెప్పారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ రంగానికి చేస్తున్న సేవలకు గాను లోకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షారుక్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందించారు.

Show comments