NTV Telugu Site icon

Mufasa Movie: ‘ముఫాసా’ కోసం ఇద్దరు తనయులతో కలిసి రంగంలోకి షారుఖ్ ఖాన్!

Shah Rukh Khan Sons

Shah Rukh Khan Sons

Shah Rukh Khan Dubbing for Mufasa: 1994లో వచ్చిన యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. 2019లో 3D యానిమేషన్‌లో రిలీజ్ చేస్తే.. అప్పుడు కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ది లయన్ కింగ్‌లో భాగంగా తాజాగా ‘ముఫాసా’ సిద్దమైంది. ఈ సినిమాను 2024 డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఆయా భాషల్లోని స్టార్ హీరోలతో డబ్బింగ్ చేయిస్తున్నారు.

హిందీలో విడుదల కాబోతున్న ముఫాసా సినిమాకు బాలీవుడ్ ‘కింగ్’ షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. షారుఖ్ మాత్రమే కాదు ఆయన ఇద్దరు కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ కూడా వాయిస్‌ ఓవర్ అందించారు. లయన్ కింగ్ పాత్రకు షారుఖ్ డబ్బింగ్ చెప్పాడు. సింబా పాత్రకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పగా.. ముఫాసా పాత్రకు అబ్రమ్ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read: Paris Olympics 2024: హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్‌!

ఇక తెలుగులో విడుదల కానున్న ముఫాసా కోసం కూడా స్టార్ హీరోనే ఎంచుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైడ్ లాండ్స్‌లో ఓ కింగ్‌ ఎలా ఎదిగాడనే కథతో ముఫాసాను తెరకెక్కించారు. ఓ మృగరాజు, ఆయన వారసుల నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను వాల్డ్ డిస్నీ నిర్మిస్తోంది.

Show comments