NTV Telugu Site icon

Shah Rukh Khan: డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలైన బాలీవుడ్ బాద్ షా..

Shah Rukh Khan

Shah Rukh Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్లోని కెడి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నటుడు షారుఖ్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా కెడి ఆసుపత్రిలో చేరారని అహ్మదాబాద్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ జాట్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య గౌరీ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్లోని కెడి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని కింగ్ ఖాన్ నిన్న కెకెఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లో ఉన్నారు.

Viral Video: రష్యన్ టూరిస్టుతో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన భారతీయ కాబ్లర్..

నిన్నటి ఐపిఎల్ 2024 కెకెఆర్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో తీవ్రమైన వేడి కారణంగా నటుడు హీట్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడని., అదికాస్తా ఆసుపత్రిలో చేరడానికి దారితీసిందని సమాచారం. షారుఖ్ మంగళవారం అర్థరాత్రి కెకెఆర్ జట్టుతో హోటల్ చేరుకున్నారు. మరుసటి మధ్యాహ్నం (మే 22) నటుడు తన పరిస్థితి మరింత దిగజారిందని తెలుస్తోంది. దాంతో ఆసుపత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వారు తెలిపారు.

షారుఖ్ ఖాన్ సన్నిహితురాలు, నటి జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతా ఈ రోజు కెడి ఆసుపత్రి నుండి బయటకు రావడం కనిపించింది.
గుజరాత్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అహ్మదాబాద్లో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ రోజు షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ పుట్టినరోజు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ క్వాలిఫైయర్ 1లో SRH పై KKR అద్భుత ప్రదర్శనతో సుహానా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆమె తన తండ్రి షారుఖ్, తమ్ముడు అబ్రామ్, స్నేహితులు అనన్య, షనాయా, నవ్యా నందాలతో కలిసి స్టాండ్లలో కనిపించింది.