వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణి షఫాలి వర్మ నవంబర్ నెలకు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్రతీకా రావల్ గాయం కారణంగా సెమీఫైనల్స్‌కు ముందు వర్మను భారత జట్టులోకి తీసుకున్నారు. కానీ షఫాలి తన మొదటి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయింది. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో వర్మ 78 బంతుల్లో 111.53 సగటుతో 87 పరుగులు చేసి, భారత్ 298/7 స్కోరును సాధించడంలో కీ రోల్ ప్లే చేసింది. బౌలింగ్ లోనూ ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి ఏడు ఓవర్లలో 36 పరుగులకు సునే లూస్, మారిజాన్ కాప్ ల కీలక వికెట్లను పడగొట్టింది.
Also Read:Rajamouli Avatar 3: సర్‌ప్రైజ్‌కు ప్లాన్ చేసిన జక్కన్న.. ‘అవతార్ 3’లో వారణాసి ఆట!
వర్మ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో భారతదేశం ఫైనల్‌ను 52 పరుగుల తేడాతో గెలిచి తమ తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఇషా ఓజా, థాయిలాండ్‌కు చెందిన తిపాచా పుట్టావోంగ్‌లతో పాటు షెఫాలి వర్మ నామినేట్ అయ్యారు. ఐసిసి ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ సందర్భంగా ఓజా మరోసారి తన మ్యాచ్ విన్నింగ్ ప్రతిభను ప్రదర్శించింది. ఈ నెలలో జరిగిన ఏడు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, ఆమె 137.50 స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు చేసింది.
Also Read:Shankar : నిర్మాతలను ముంచిన దర్శకుడు శంకర్‌కు 1000 కోట్లతో మరో ఛాన్స్?
వర్మ బంతితో కూడా బాగా రాణించింది, 18.14 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టడం ద్వారా తన ఆల్ రౌండ్ సామర్థ్యాలను ప్రదర్శించింది. థాయిలాండ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ తిపాచా పుట్టావాంగ్ కూడా అద్భుతంగా రాణించింది. ఆమె తన జట్టు ICC ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీని గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించింది. టోర్నమెంట్‌లో 15 వికెట్లతో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.
