Site icon NTV Telugu

OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

Otr

Otr

OTR: ఆ జూనియర్ మంత్రికి ఫాదర్ స్ట్రోక్‌ బాగా… గట్టిగా తగులుతోందా? తండ్రి రూపంలో రోజుకో కొత్త పంచాయతీ వస్తోందా? ఏకంగా ఆయన కుర్చీ కిందికే నీళ్ళొచ్చేంత ముప్పు ముంచుకు వస్తోందా? అయినాసరే… మంత్రి ఎందుకు మాట్లాడ్డం లేదు? తండ్రిని కాదనలేకపోతున్నారా? లేక ఆయనకేం తెలియడం లేదా? ఒక రాష్ట్ర మంత్రికి తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలియకుండా ఉంటుందా? ఎవరా మంత్రి? ఏంటాయన ఫాదర్‌ స్టోరీ?

పాలిటిక్స్‌లో జనరల్‌గా సన్‌ స్ట్రోక్స్‌ ఉంటాయి. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొడుకులు చేసే అరాచకాలతో ఎఫెక్ట్‌ అయిన సీనియర్‌ లీడర్స్‌ చాలామందే ఉన్నారు. కానీ.. రామచంద్రపురం నియోజకవర్గంలో మాత్రం వ్యవహారం రివర్స్‌లో ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. అదే ఊపులో చంద్రబాబు కేబినెట్‌లో మినిస్టర్‌ అయ్యారు వాసంశెట్టి సుభాష్. ఫస్ట్‌టైం ఎమ్మెల్యేకి గెలిచిన వెంటనే మంత్రి పదవి దక్కడమన్నది చిన్న విషయం కాదు. కాకుంటే… వాసంశెట్టికి లక్‌ అలా లాగిపెట్టి తన్నింది. సామాజికవర్గ సమీకరణలు కలిసొచ్చి కేబినెట్‌ మినిస్టర్‌ అయిపోయారాయన. సుభాష్ సొంత నియోజకవర్గం అమలాపురం రిజర్వుడ్‌ కావడంతో.. ఆయన రామచంద్రపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. కానీ…గెలిచినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతున్నారు మంత్రి. ఇక ఆయన తండ్రిగారి లీలల గురించి అయితే, ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నది రామచంద్రపురం టాక్‌.

HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. ఖానామెట్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్.!

కొడుకు అధికారాన్ని అ్డడు పెట్టుకుని వాసంశెట్టి సత్యం చేయని దందా లేదంటూ స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. చివరికి తనను ప్రశ్నిస్తే సొంత టీడీపీ వాళ్ళను సైతం దగ్గరికి పిలిపింపుచుని మరీ కొడుతున్నారట. ఒక గ్రామ టిడిపి అధ్యక్షుడి విషయంలో తనను ప్రశ్నించాడన్న కోపంతో… పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ను పిలిపించి కొట్టారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇంటర్నల్‌గా పార్టీలో కూడా పెద్ద రచ్చ అయింది. దాంతో నేరుగా మంత్రి సుభాష్ ఇన్వాల్వ్ అయిపోయి తిన్న దెబ్బల గురించి బయట ఎవరికీ చెప్పొద్దంటూ సదరు మాజీ సర్పంచ్‌తో రాజీ చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. సత్యం ఇక నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా మారిపోయారన్న ఆరోపణలున్నాయి. నాకు తెలియకుండా నియోజకవర్గంలో పూచికపుల్ల కూడా కదలడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారట. కొడుకు మంత్రిగా అమరావతిలో బిజీగా ఉంటే… ఇక్కడ లోకల్‌గా తండ్రే ఎమ్మెల్యే సీట్లో ఉన్నట్టు కనిపిస్తోందని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు రామచంద్రపురంలో.

లోకల్‌ పార్టీలో కూడా.. సత్యం చెప్పిందే శాసనం అనేది ఓపెన్ సీక్రెట్. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు సుభాష్‌. ఇక ఇప్పుడు తొలి నుంచి పసుపు పార్టీలో ఉన్న వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేశారట మంత్రి ఫాదర్. పార్టీ గీర్టీ, లాయల్టీ గీయల్టీ జాన్తానై…. నాకు ఎవరు కంఫర్ట్‌గా ఉంటారో, చెప్పిన వ్యవహారాలు ఇబ్బంది జరక్కుండా, పేరు బయటికి రాకుండా ఎవరైతే చక్కబెడతారో వాళ్ళకే అవకాశాలు ఇస్తానని అంటున్నట్టు సమాచారం. సత్యం ఫౌండేషన్ పేరుతో ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అందరూ అందులో ఇన్వాల్వ్ అవ్వాలంటూ అనధికారిక ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

అసలు ఆ ఫౌండేషన్ ఎవరికి, ఎలా ఉపయోగపడుతుందో కూడా ఎవరికి తెలియడం లేదు, అదో బ్రహ్మ పదార్ధం అంటూ నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. లోకల్‌గా ఇంత జరుగుతున్నా…. స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయి ఉండి సుభాష్‌ పట్టించుకోరా అన్న ప్రశ్నలు సైతం పెరుగుతున్నాయి. ఇప్పుడు రామచంద్రాపురంలో ఏ పని కావాలన్నా… డబ్బే మాట్లాడుతుందన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొత్తం కమర్షియల్‌ అయిపోయిందని చివరికి తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ప్రతి పనికి రేట్‌ చార్ట్‌ ఫిక్స్‌ చేసి మరీ వసూలు చేస్తున్నారని టీడీపీ కింది స్థాయి నైయకులు సైతం గుసగుసలాడుకుంటున్నారు.

Nara Lokesh: ఏపీలో ఉద్యోగల జాతర.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు..!

అధికారులకు సైతం మంత్రి కాకుండా… షాడో ఎమ్మెల్యేనే ఆదేశాలు ఇచ్చేస్తున్నారట. తాను చెప్పిందే జరగాలని, అంతకుమించి ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సాఫ్ట్‌ వార్నింగ్‌ కూడా ఇస్తున్నట్టు తెలిసింది. కొన్ని సార్లయితే… ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అఫీషియల్ మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నారట అనఫిషియల్‌ పర్సన్‌. అధికారులు సైతం…. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడాన్ని చూశాంగానీ మరీ ఇంత డైరెక్టుగా ఆఫీస్‌కి వచ్చేసి మీటింగ్స్‌ పెట్టడాన్ని ఎరగబోమంటూ బుగ్గులు నొక్కుకుంటున్నారు. ఇక పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్ట్‌ల విషయంలో కూడా తొలి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసి వైసిపి నుంచి టీడీపీలో చేరిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారన్నది ఇంటర్నల్‌ వాయిస్‌.

దాని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే…అలా చేయకుంటే తర్వాత ఏమీ మిగలదని అంటున్నట్టు తెలిసింది. అయితే… నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా… మంత్రికి తెలియకుండా ఉంటుందా? ఆయన ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా అంటూ రామచంద్రపురం తమ్ముళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. అన్నిటికీ మించి సత్యం వ్యవహారశైలి హాట్‌ టాపిక్‌ అయింది. సుభాష్‌ రాష్ట్రానికి మంత్రి అయితే కావచ్చుగానీ… అతనికి నేను తండ్రిని, మినిస్టర్‌ని సైతం శాసించగలవాడిని అన్నట్టుగా ఆయన తీరు ఉందంటూ విమర్శలు పెరుగుతున్నాయి. ఇదంతా చూస్తున్న జనం మాత్రం రామచంద్రపురంలో ఏ రాజ్యాంగం అమలవుతోందో అర్ధంకావడంలేదని మాట్లాడుకోవడం కొసమెరుపు.

Exit mobile version