NTV Telugu Site icon

Shabbir Ali: గజ్వేల్ లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ

Shabir Ali

Shabir Ali

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను పోటీ చేయాలని ఎవరు కోరలేదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా చెప్పడం సిగ్గు చేటు అంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. చేతకాని ఎమ్మెల్యే భయంతో పోటీ చేయాలని కోరారు తప్ప.. ప్రజలు ఎవరు కోరలేదు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Read Also: China: పతనమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ.. కారణాలు ఇవే

కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడిస్తాను అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోవడం పక్కా ఖాయం అని ఆయన తెలిపారు. 10 ఏళ్లలో కామారెడ్డికి ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారు?.. కామారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి పోటీకి రావాలి అని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పేరుతో ఊరికో ఎమ్మెల్యే తయారయ్యేందుకు రెడీ అవుతున్నారు అని షబ్బీర్ అలీ అన్నారు. ప్రశ్నించే గొంతును అనగతొక్కలని కేసీఆర్ కామరెడ్డికి వస్తున్నారు.. ఆయన ఆటలు కామారెడ్డిలో సాగవు అని తెలిపారు.

Read Also: PM Modi: దటీజ్‌ మోడీ.. త్రివర్ణ పతాకానికి ఆయన ఇచ్చే గౌరవం అలాంటిది..

చింత మడకలో ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు కామారెడ్డి ప్రజలకు ఇచ్చి కామారెడ్డిలో ఫొటీ చేయాలి అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ కుటుంబం వర్సెస్ కామారెడ్డి ప్రజలకు మధ్య పోటీ.. కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్క ముది రాజ్ కు కూడా టికెట్ ఇవ్వకపోవడం అవమానించడమేనని షబ్బీర్ అలీ అన్నారు. బీసీలపై కేసీఆర్ కపడ ప్రేమ చూపిస్తున్నాడని షబ్బీర్ అలీ ఆరోపించారు.