Shabbir Ali: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో 8 ట్రాక్‌లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్‌కు ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అరకొర సదుపాయాలతో జిల్లా క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. ఒలంపిక్ స్థాయి ప్రమాణాలతో క్రీడా అకాడమీ ఏర్పాటు చేసుకుందామని ఆయన స్పష్టం చేశారు. హకీంపేటలో 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని షబ్బీర్ అలీ తెలిపారు. గత ప్రభుత్వం క్రీడా మైదానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని ఆయన విమర్శించారు.
Read Also: Singur Project Gates Lifted: నిండుకుండలా సింగూరు.. రెండు గేట్లు ఎత్తివేత