NTV Telugu Site icon

Shabbir Ali : పోడు భూములకు పట్టాలిస్తాము.

Shabbir Ali

Shabbir Ali

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన మండలం మాచారెడ్డి అని, మీరు ఆశీర్వదిస్తే కామారెడ్డి నియోజక వర్గంకి త్రాగు సాగు నీరు తెప్పిస్తానన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకం నిలిపేసింది… లేకుంటే మచారెడ్డి లో నీళ్ళు వచ్చేవని ఆయన అన్నారు. మోడీ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు. దేశ ప్రజలు నష్టపోతారని ఆయన మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తామని, బీబీ పాటిల్ కు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే మండలానికి కూడా రాలేదన్నారు. ధరని ద్వారా కోల్పోయిన భూములు కాపాడుతామన్నారు.

 

సురేష్ షెట్కార్ ను ఆశీర్వదించండి. భారీ మెజారిటీతో గెలిపించండి అని ఆయన కోరారు. రైతులు, కౌలు రైతుల అధైర్యపడవద్దని సూచించారు. రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామన్నారు. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించి వారి వివరాలు సేకరించారన్నారు. ఎన్నికల తర్వాత బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులకు ఆదేశించారు.