పార్టీ ఫిరాయింపుల పై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడకొడతం అంటూ కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలా కులుస్తావో మేము చూస్తాం, మేము ద్వారాలు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవడం ఖాయమని ఆయన వెల్లడించారు. మాతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఫిరాయింపులు వద్దని మా హై కమాండ్ చెప్పడం వల్లే ఆగామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదని, కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోటీ అని ఆయన అన్నారు.
10 ఏళ్లలో కేటీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని లూటి చేసింన్నారు. అధికారం లోకి వచ్చి రెండు నెలలు కాకా ముందే మాపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో 18వేల పోలీసుల నియామకం, నోటిఫికేషన్ పై అసెంబ్లీ లో సీఎం ప్రకటన చేస్తారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, కేసీఆర్ నియంత పాలనను అంతమొందించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెప్పారు.
