NTV Telugu Site icon

Shabbir Ali : గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడు

Shabbir Ali

Shabbir Ali

హైడ్రా వల్ల పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని విజ్ఞప్తుల మేరకు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆసవుద్దీన్ విద్యాలయలకు హైడ్రా నోటీసులు పంపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు పంపిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా నాలాలపై నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రభుత్వమన్నారు. రుణమాఫీ కానీ రైతులకు త్వరలో ఇంటిట సర్వే చేసి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చడానికి కౌన్సిల్ లో తీర్మానం చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. కార్పొరేషన్ ద్వారా కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వస్తాయని, త్వరలో కామారెడ్డి నియోజకవర్గం, పట్టణానికి త్రాగునీరు,సాగునీరు తీర్చడానికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రత్యేక నిధుల ద్వారా సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు షబ్బీఆర్‌ అలీ.

 Japan: జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారానికి 4 రోజులే పని దినాలు