NTV Telugu Site icon

Mahua Moitra: ఆమె ఎనర్జీకి కారణం సె*క్స్.. ఎంపీ అభ్యర్థి కామెంట్స్ వైరల్

Mahuva

Mahuva

సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు పాలైంది. ఆ పార్టీ నేత షాజహాన్ షేక్ మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణలతో రాష్ట్రం అట్టుడికింది. ఇక పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. స్థానిక మీడియా రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఊహించని సమాధానం ఇచ్చింది. అది కూడా నవ్వుతూ.. సంతోషంగా సమాధానం ఇచ్చింది. ఎనర్జీకి కారణమేంటి? అని మీడియా ప్రతినిధి అడిగితే.. ఠక్కున తడబడకుండా ‘సె*క్స్’ అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయలు చేస్తున్నారు..

వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తరపున ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా నగదు స్వీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం కమిటీ వేసింది. ఆమె అనైతిక ప్రవర్తనకు పాల్పడిందని ఎథిక్స్ కమిటీ తేల్చింది. దీంతో డిసెంబరు 8న ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ఈసారి లోక్‌సభ సీటు దక్కకపోవచ్చని అంతా భావించారు.. కానీ అనూహ్యంగా ఆమెకే తిరిగి కృష్ణానగర్ లోక్‌సభ స్థానాన్ని మమతా బెనర్జీ కేటాయించారు. 2019లో కూడా ఇదే స్థానం నుంచే ఆమె విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Sreeleela : కాలేజీ కుర్రాళ్ళతో కలిసి’ కుర్చీని మడత పెట్టి’ న శ్రీలీల..

ఇక గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆమె క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రచారంలో ఉండగా.. స్థానిక మీడియా ప్రతినిధి.. మీ శక్తికి కారణమేంటి? అని ప్రశ్నించాడు. దీనికి ఆమె తడబడకుండా.. ఠక్కున ‘సెక్స్’ అంటూ బదులిచ్చారు. ఆమె నవ్వుతూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడుతున్నారు.