Shopping Mall Tragedy : కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. షాపింగ్ కోసం వెళ్లిన తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద కర సంఘటన ఉగాండాలో చోటుచేసుకుంది. సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వేళ ఉగాండాలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వివరాలు.. ఉగాండాలోని కంపాలాలోని ఫ్రీడమ్ సిటీ మాల్ వద్దకు న్యూ ఇయర్ వేడుల కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలించారు. ఫ్రీడమ్ సిటీ మాల్ వెలుపల బాణాసంచా ప్రదర్శనను చూడటానికి ప్రజలు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.
Read Also: Selfi Fight: లేడీస్‌తో సెల్ఫీకి పోటీపడ్డ రెండు వర్గాలు.. తీసుకెళ్లి స్టేషన్లో పెట్టిన పోలీసులు
తొక్కిసలాట జరగడంతో ఘటన స్థలంలో ఐదుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాట్వే టెరిటోరియల్ పోలీసులు నూతన సంవత్సర వేడుకలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన హడావిడి, నిర్లక్ష్యం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ నిర్వహణతో సంబంధం ఉన్నవారు.. అక్కడ హాజరైన వారిని బయటికి వెళ్లి బాణాసంచా ప్రదర్శనను చూడమని ప్రోత్సహించినప్పుడు అర్దరాత్రి సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.