Site icon NTV Telugu

Russia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి

Russia

Russia

రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్ రష్యాలో. రష్యాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఒక వంతెన కూలిపోవడంతో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు.

Also Read:Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..!

ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ఏడుగురు మృతి చెందారని, ఇద్దరు పిల్లలు సహా 30 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు.

Exit mobile version