NTV Telugu Site icon

Sesham Mike-il Fathima : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళం బ్లాక్ బస్టర్..

Whatsapp Image 2023 12 10 At 6.50.02 Pm

Whatsapp Image 2023 12 10 At 6.50.02 Pm

ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాక భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ప్రతి సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ సినిమాలలో ఎలాంటి జోనర్ సినిమాలకైనా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, ఆర్‌ డీ ఎక్స్‌, కాసర్‌ గోల్డ్‌ మరియు కన్నూర్‌ స్వ్కాడ్‌ తదితర మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. అదే కల్యాణి ప్రియ దర్శన్‌ నటించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా. నవంబర్‌ 17న మలయాళంలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తోంది. డిసెంబర్‌ 15 నుంచే కల్యాణి ప్రియ దర్శన్‌ ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.మనూ సి కుమార్ తెరకెక్కించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌తో పాటు ఫెమినా జార్జ్, షహీన్ సిద్ధికీ, పార్వతి, అనీశ్ మీనన్ మరియు సాబుమన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా నూర్జహాన్‌(కల్యాణి ప్రియదర్శన్) ఫుట్‌ బాల్‌ కామెంటేటర్‌ అవ్వాలని అనుకుంటుంది. అయితే ఫ్యామిలీలో ఎవరి మద్దతూ లభించదు. దీంతో స్థానిక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు కామెంటరీ చేస్తుంటుంది. అయితే ఇంటర్నేషనల్‌ ఫుట్ బాల్‌ మ్యాచ్‌లకు కామెంటరీ కావాలన్నదే ఫాతిమా లక్ష్యం. మరి ఆమె లక్ష్యం నెరవేరిందా.. అందుకు ఫాతిమా స్నేహితులు ఆమెకు ఎలాంటి సాయం చేశారన్నది ఈ సినిమా కథ.. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మలయాళి మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Show comments