NTV Telugu Site icon

Covishield Doses : రెండు కోట్ల కోవిషీల్డ్ డోసులు కేంద్రానికి ఫ్రీగా ఇచ్చిన సీరమ్ ఇనిస్టిట్యూట్

Covisheild

Covisheild

Covishield Doses : కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఉచితంగా అందించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రూ.410 కోట్ల విలువైన డోస్‌లను ఉచితంగా అందజేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఓ నివేదికలో వెల్లడించారు. డెలివరీ ఎలా చేయాలో చెప్పమని ప్రకాష్ కుమార్ సింగ్ మంత్రిత్వ శాఖ నుండి కోరినట్లు తెలిసింది.

Read Also: Former Pope Benedict Condition Critical : మాజీ పోప్ బెనెడిక్ట్ పరిస్థితి విషమం

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 170 కోట్ల కంటే ఎక్కువ డోసుల కోవిషీల్డ్‌ని జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమం కోసం ప్రభుత్వానికి అందించింది. చైనా, దక్షిణ కొరియాతో సహా కొన్ని దేశాల్లో COVID-19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్‌కు సంబంధించిన నిఘా, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ప్రభుత్వం ముమ్మరం చేసింది. అర్హులైన వయోజన జనాభాలో కేవలం 27 శాతం మంది మాత్రమే ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లను తీసుకున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ల పంపిణీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వ అధికారులను కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

Read Also: Eknath Shinde : అవసరమైతే సుప్రీంకోర్టుకు పోతాం.. కానీ ఒక్క అంగుళం కూడా వదులుకోం