Site icon NTV Telugu

Serial Deaths: తురకపాలెంలో వరుస మరణాలు.. ఐదు నెలల్లో 30మంది మృతి

Death

Death

గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు నెలల్లో 30మంది మృతిచెందారు. దీంతో వైద్యారోగ్య శాఖ వరుస మరణాలపై దృష్టి పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఎపిడిమిక్ బృందంతోపాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎస్.పి.ఎం., మైక్రో బయాలజీ వైద్యబృందం పర్యటిస్తోంది. మృతుల‌ కుటుంబాలనుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మరణాలకు దోమకాటా… లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో శాంపిల్స్ సేకరించారు. బ్లడ్ శాంపిల్స్, నీటి పరీక్షల ఫలితాలు వస్తే కారణం తెలిసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Exit mobile version