ప్రముఖ సీరియల్ నటి నందిని మృతి చెందడం తమిళ, కన్నడ టెలివిజన్ రంగాలను ఒక్కసారిగా విషాదం నెలకొంది. బెంగళూరులోని తన నివాసంలో ఆమె మరణించగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని, సొంత భాష కాకపోయినా కన్నడ, తమిళ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన ‘గౌరి’ సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇటీవల వరకూ బెంగళూరులోనే షూటింగ్ జరిగిన ఈ సీరియల్, తాజాగా చెన్నైకి మారింది. కొద్దిరోజుల విరామం కోసం నందిని బెంగళూరుకు వచ్చిన సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Also Read : Rashmika-Vijay : రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్..
నందిని అకాల మరణంతో సహనటీనటులు, అభిమానులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ‘గౌరి’ సీరియల్ ప్రసారం చేస్తున్న కలైంజర్ టీవీ ఛానల్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేసింది. తోటి నటుడు సతీష్ మాట్లాడుతూ, నందినికి ఇంకా పెళ్లి కాలేదని, ఇలా జరగడం అర్థం కావడం లేదని అన్నారు. ఏ కారణంతో ఈ ఘటన జరిగిందన్నది దర్యాప్తు జరుగుతుండగా.. ఒక ప్రతిభావంతమైన నటి జీవితం ఇంత త్వరగా ముగియడం ఇండస్ట్రీ మొత్తాన్ని కలిచివేస్తోంది. ఈ తరహా ఘటనలు మనల్ని మానసిక ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అందుకే ఎవరికైనా మానసిక ఒత్తిడి ఉంటే, నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం లేదా నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
