NTV Telugu Site icon

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణమిదే!

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభం కాగా.. ముగింపు కూడా స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి.. 75,410 దగ్గర ముగియగా.. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 22,957 దగ్గర ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు భారత్‌పై ప్రభావం చూపడం వల్లే సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

ఇది కూడా చదవండి: Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. చేవేళ్ల ఠాణాలో కేసు నమోదు

ఇక శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన కాసేపటికే పంజుకుంది. అనంతరం సెన్సెక్స్ ఆల్ టైమ్ హై రేంజ్‌లో దూసుకెళ్లింది. సెన్సెక్స్ 75, 582.28 మార్కును తాకగా.. నిఫ్టీ తొలిసారి 23,000 మార్కును దాటింది. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, లారెన్స్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి.

ఇది కూడా చదవండి: Purandeswari: కౌంటింగ్ కు సిద్ధం కావాలి..బీజేపీ నాయకులకు పురంధేశ్వరి పిలుపు